K. Kavitha: కాళేశ్వరం మరమ్మతులు కమీషన్ల కోసమే : కవిత
కమీషన్ల కోసమే : కవిత
K. Kavitha: కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. అయితే గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం దారుణంగా వ్యవహరించడం వల్ల రైతుల పంటలు ఎండిపోయాయని తీవ్రంగా ఆరోపించారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత, “ప్రభుత్వం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టడం కేవలం కమీషన్లు పొందడం కోసమే. రైతుల హక్కులు కాపాడకుండా, రెండున్నరేళ్ల పాటు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి పంటలు ఎండబెట్టారు” అని మండిపడ్డారు.
ఇంకా మాట్లాడుతూ మున్సిపల్, అర్బన్ ఫారెస్ట్రీ శాఖల్లో తీవ్రమైన అవినీతి జరుగుతోందని ఆరోపించారు. “ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ లాభాల కోసం హైదరాబాద్‌కు నష్టం చేయవద్దు. రైతులు, సామాన్యుల హక్కులను కాపాడుకోవాలి” అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సకాలంలో సరిచేసి రైతులకు నీరు అందించాలని, లేని పక్షంలో తమ ఉద్యమం కొనసాగుతుందని కవిత హెచ్చరికలు జారీ చేశారు.