K. Kavitha: అబద్ధాలు చెప్పే కాంగ్రెస్.. నిద్రాణమైన బీఆర్ఎస్: కవిత

నిద్రాణమైన బీఆర్ఎస్: కవిత

Update: 2026-04-08 15:42 GMT

K. Kavitha: తెలంగాణ చరిత్రను మార్చేసి, భవిష్యత్తును తీర్చిదిద్దే కొత్త పార్టీ ఈ నెల 25వ తేదీన వస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆవిర్భావ రోజు అద్భుతమైన ఎజెండాను ప్రకటిస్తామని, కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలతో తెలంగాణ భవిష్యత్తును మారుస్తామని, దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆమె ప్రకటించారు.

గద్వాల నియోజకవర్గానికి చెందిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తన అనుచరులతో తెలంగాణ జాగృతిలో చేరారు. కవిత వారికి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘‘జాగృతి తరపున ప్రశ్నిస్తాం.. పోరాడతాం.. పరిష్కరిస్తాం. వెలుగుమట్ల తరహాలో ప్రజల మధ్యనే ఉండి సమస్యలపై పోరాటం చేస్తాం’’ అని తెలిపారు.

కవిత మరింత వివరిస్తూ, ‘‘బీఆర్ఎస్ పార్టీ అచేతన స్థితిలో ఉంది.. నిద్రపోతోంది. గద్వాలలో చేనేత, పత్తి రైతులకు అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించడం లేదు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తోంది. రాష్ట్ర పాలన మొత్తం ఢిల్లీ నుంచే జరుగుతోంది. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చేసింది. ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేసి జోగులాంబ జిల్లాలో తెలంగాణ జాగృతికి మొదటి విజయం దక్కింది. ఎమ్మెల్యే సీట్లలో గద్వాలలోనే మొదటి విజయం సాధిస్తామని నమ్మకం ఉంది. గద్వాల గడీ మీద ఉద్యమకారుల జెండా ఎగురుతుందని అనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News