K. Kavitha: శ్రీరామనవమి శుభముహూర్తంలో.. ఏప్రిల్ 25న కవిత కొత్త రాజకీయ పార్టీ స్థాపన

ఏప్రిల్ 25న కవిత కొత్త రాజకీయ పార్టీ స్థాపన

Update: 2026-03-27 10:51 GMT

K. Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు నూతన రాజకీయ పార్టీని అధికారికంగా స్థాపించనున్నట్లు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అధ్వయ కన్వెన్షన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ ప్రకటన చేయనున్నారు. అదే సమయంలో పార్టీ పేరు, జెండాను కూడా అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిపారు.

శ్రీరామనవమి మంచి రోజు కాబట్టి ఈ తేదీని ఎంచుకున్నట్లు కవిత వివరించారు. ‘‘యువత, మహిళలకు మా పార్టీలో మంచి స్థానం ఉంటుంది. ఇన్నాళ్లు మగవాళ్లు ఏర్పాటు చేసిన పార్టీలను చూశారు. తెలంగాణ ఆడబిడ్డగా నేను పార్టీ పెడితే ఎలా ఉంటుందో మీరే చూస్తారు’’ అని ఆమె ఉత్సాహంగా అన్నారు.

ఈ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. తెలంగాణ జాగృతి వేదికగా ఇప్పటి వరకు కార్యకలాపాలు సాగిస్తున్న కవిత, బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 25న జరిగే సమావేశం తర్వాత పార్టీ అజెండా, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News