Kavitha Demands: బండి భగీరథ్‌కు లుకౌట్ నోటీసులు ఇవ్వాలి: కవిత

లుకౌట్ నోటీసులు ఇవ్వాలి: కవిత

Update: 2026-05-13 12:51 GMT

Kavitha Demands: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్ విదేశాలకు పారిపోకుండా పోలీసులు తక్షణం చర్యలు తీసుకోవాలని కవిత కోరారు. బాధితురాలి ఫొటోలు బయటపెట్టిన వారిని అరెస్టు చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు.

ఒకవైపు కుమారుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ బండి సంజయ్ ప్రధాని మోదీతో వేదిక పంచుకోవడం శోచనీయమని కవిత విమర్శించారు.

Tags:    

Similar News