కేటీఆర్‌... మహేష్‌ బాబును కాపీ కొడుతున్నారు... ఎంపీ చామల

Update: 2025-06-16 11:31 GMT

భరత్‌ అనే నేను సినిమాలో మహేష్‌ బాబులా ఫీలై కేటీఆర్‌ ఆయన్నే కాపీ కొడుతున్నాడని భువనగిరి పార్లమెంట్‌ సభ్యుడు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. జైలుకు వెళితేనే సీయం అవుతారనే ట్రెండును కేటీఆర్ బలంగా నమ్ముతున్నాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ ఉద్యమ కారుడు కానప్పటికీ తానేదో భగత్‌ సింగ్‌, అల్లూరి సీతారామరాజు లాగ ఫీల్‌ అవుతుంటారని అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు కాబట్టే కేటీఆర్‌ పై విచారణ జరుగుతోందని చామల చెప్పారు. అరెస్ట్‌ కావాలని కేటీఆర్‌ ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నాడని ఎంపీ మండిపడ్డారు. గతంలో జైలుకు వెళ్ళానని ఎన్నిసార్లైనా వెళతానని చెపుతున్న కేసీఆర్ జైలుకు ఎప్పుడు వెళ్లాడో చెప్పాలన్నారు. ఫార్ములా వన్‌ రేసు కేసులో ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌ కీలకమైన వ్యక్తని ఆయన ఎక్కడున్నడో కనిపించడం లేదని ఎంపీ అనుమానం వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాలకు నిలయం కేసీఆర్‌ నిలయమన్నారు. వీళ్ళ అవసరాలు కప్పిపుచ్చుకోవడానికి ఏమైనా చేస్తారని ఎంపీ చామల ఆరోపించారు. కేటీఆర్‌ ప్లాన్‌ తోనే ప్రభాకర్‌ రావు అమెరికా వెళ్ళి ఇంతకాలం దాక్కున్నాడని ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News