K. Kavitha: డీలిమిటేషన్ బిల్లును మహిళా రిజర్వేషన్లతో లింక్ చేయడం పెద్ద కుట్ర: కల్వకుంట్ల కవిత
మహిళా రిజర్వేషన్లతో లింక్ చేయడం పెద్ద కుట్ర: కల్వకుంట్ల కవిత
By : PolitEnt Media
Update: 2026-04-16 05:47 GMT
K. Kavitha: మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టడం ఒక పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లును తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణకు రాజకీయ ప్రాధాన్యం తగ్గించే ఏ ప్రయత్నం జరిగినా ఊరుకోమని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలకు సబ్ కోటా తప్పనిసరిగా ఉండాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.