Mahesh Kumar Goud: కాంగ్రెస్‌ను వీడొద్దని జీవన్ రెడ్డిని కోరాం: మహేష్ కుమార్ గౌడ్

మహేష్ కుమార్ గౌడ్

Update: 2026-03-24 10:52 GMT

Mahesh Kumar Goud: కాంగ్రెస్‌ పార్టీని వీడొద్దని మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని వేడుకున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. జగిత్యాలలో జీవన్‌రెడ్డితో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సాకేవత్‌తో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ, ‘‘జీవన్‌రెడ్డి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు. 43 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయన మాకు తండ్రిలాంటివారు. రాజకీయాల్లో ఆయన సీనియర్‌ నేత. ఆయనకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలుకోదలచుకోలేదు. పార్టీని వీడే అంశంపై పునరాలోచన చేయాలని మేం కోరాం’’ అని తెలిపారు.

ఈ సమావేశంలో జీవన్‌రెడ్డి పార్టీలోనే కొనసాగాలని, కాంగ్రెస్‌కు ఆయన సేవలు ఇంకా అవసరమని నాయకులు స్పష్టంగా వ్యక్తం చేశారు. జీవన్‌రెడ్డి పార్టీ మార్పు గురించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News