RSS Chief Mohan Bhagwat: సమాజ నిర్మాణంలో తల్లి పాత్ర కీలకం: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

Update: 2026-07-27 05:14 GMT

RSS Chief Mohan Bhagwat: కుటుంబం, సమాజాన్ని తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అత్యంత కీలకమని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. నగరంలోని కుమురంభీం ఆదివాసీ భవన్‌లో విశ్వమాంగల్య సభ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యుగానుకూల మాతృత్వం’ సదస్సులో ఆయన మాట్లాడారు.

వివాహం, కుటుంబ వ్యవస్థలే సమాజానికి బలమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక విభాగాలుగా నిలుస్తాయని భాగవత్ తెలిపారు. మహిళలు, పురుషుల పాత్రలు సమాన ప్రాధాన్యం కలిగినవని, పరస్పరం పోల్చాల్సిన అవసరం లేదని అన్నారు. భాష, రూపం, వేషంలో వేర్వేరుగా ఉన్నా ధర్మం విషయంలో అందరం ఆత్మగా ఒకటేనని చెప్పారు.

సహజీవనాలు బాధ్యత తీసుకోవడం పట్ల విముఖంగా ఉంటాయని, ధర్మం వైపు ఉండాలనుకునే వారికి పెళ్లి తప్పనిసరని సూచించారు. ఎల్‌జీబీటీక్యూలపై సమాజం వివక్ష చూపకూడదని కూడా ఆయన అన్నారు.

ఈ సదస్సులో సభ వ్యవస్థాపకులు జితేంద్రనాథ్ మహరాజ్, మార్గదర్శకులు ప్రశాంత్‌జీ హోల్కర్, విశ్వమాంగల్య సభ జాతీయ అధ్యక్షురాలు నళిని హవాడే, తెలంగాణ అధ్యక్షురాలు శ్రుతి బొడ్డుపల్లి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News