Pride of Telugu Literature: తెలుగు సాహిత్యానికి గర్వకారణం – నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

Update: 2026-03-17 07:34 GMT

Pride of Telugu Literature: ప్రముఖ కవి, రచయిత, సామాజిక వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం-2025 లభించింది. ఆయన రచించిన కవితా సంపుటి **‘అనిమేష’**కు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది.

‘అనిమేష’ అంటే రెప్పలు వాల్చనిది అని అర్థం. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాలు, మానవ సంబంధాల విచ్ఛిన్నం, కూలీలు, సామాన్యుల కష్టాలు వంటి అంశాలను హృదయస్పర్శిగా చిత్రీకరించిన కవితల సంకలనమిది. సిధారెడ్డి తన రచనల ద్వారా తెలంగాణ సంస్కృతి, అస్తిత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటారు.

తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్‌గా పనిచేసిన సిధారెడ్డి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు. ఆయనకు అవార్డు లభించడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా పలువురు సాహితీవేత్తలు, ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు.

24 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు

సోమవారం కేంద్ర సాహిత్య అకాడమీ 2025 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలను ప్రకటించింది. నందిని సిధారెడ్డి సహా 24 భాషల్లో ఉత్తమ రచనలు చేసిన 24 మంది రచయితలు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.

మార్చి 31న దిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు గ్రహీతలందరికీ పురస్కారం మరియు రూ.లక్ష నగదు బహుమతి అందజేస్తారు.

Tags:    

Similar News