CM Revanth Reddy: వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చి రైతును రాజుగా చేస్తాం: సీఎం రేవంత్‌

రైతును రాజుగా చేస్తాం: సీఎం రేవంత్‌

Update: 2026-03-19 10:34 GMT

CM Revanth Reddy: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

వేడుకల్లో బాచంపల్లి సంతోష్‌కుమార్‌ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఉగాది ప్రధానంగా రైతుల పండుగ. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుంది. తెలంగాణలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి. రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తుల్ని చేశాం. రైతులు ఆత్మగౌరవంతో బతికేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతు భరోసా ద్వారా ఇప్పటికే రూ.18 వేల కోట్లు అందజేశాం. ఈ నెల 22 నుంచి మళ్లీ రైతు భరోసా పథకం ప్రారంభమవుతుంది’’ అని తెలిపారు.

రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరారు. వేడుకల్లో మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:    

Similar News