Minister Azharuddin: ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అజహరుద్దీన్‌

మంత్రి అజహరుద్దీన్‌

Update: 2026-06-17 12:29 GMT

Minister Azharuddin: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నదే పేదల కోసమని మంత్రి అజహరుద్దీన్‌ అన్నారు. గాంధీభవన్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.

‘‘వివిధ సమస్యలతో ప్రజలు వచ్చారు. సుమారు 200పైగా దరఖాస్తులు అందాయి. సమస్యలపై సాధ్యమైనంత వరకు అక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేశా. 50 వరకు సమస్యలను వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరించా. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ‘ప్రజలతో ముఖాముఖి’ పేరిట పీసీసీ చీఫ్‌ మంచి కార్యక్రమం పెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నందున బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పాపం గత ప్రభుత్వానిదే. అయినా ఆ సమస్యను మా ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఎస్‌ఐర్‌పై దృష్టి సారించాం. బిహార్‌, పశ్చిమ బెంగాల్‌లో ఎక్కువగా మైనార్టీల ఓట్లు తొలగించారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నాను. నిజమైన ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకుంటున్నాం’’ అని అజహరుద్దీన్‌ అన్నారు.

Tags:    

Similar News