Bhatti Vikramarka : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పోటీ లేదు: భట్టి విక్రమార్క

భట్టి విక్రమార్క

Update: 2026-06-02 13:34 GMT


Bhatti Vikramarka : తెలంగాణ అవతరణ వేడుకల అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై మీడియా దృష్టి సారించాలని, ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సర్‌ మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పోటీయే లేదని భట్టి విక్రమార్క ధీమాగా వ్యాఖ్యానించారు. ‘‘రైతు వ్యతిరేక పార్టీ బీజేపీ మాత్రమే. పని చేసే పార్టీలకు ప్రచారం అవసరం లేదు. అసెంబ్లీ, ఎంపీ, మున్సిపల్ ఎన్నికల్లో మా సత్తా ప్రజలకు చూపించాం. జిల్లా పరిషత్ ఎన్నికలపై ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకుంటుంది’’ అని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన తెలంగాణ అభివృద్ధి, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కూడా వివరించారు.

Tags:    

Similar News