Tungaturthi Row: తుంగతుర్తి వివాదం: కోమటిరెడ్డి దూరం.. జగ్గారెడ్డికే బాధ్యత
జగ్గారెడ్డికే బాధ్యత
Tungaturthi Row: తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ మండల అధ్యక్ష పదవుల నియామకాలపై నెలకొన్న వివాదాన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్వయంగా చూసుకుంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోబోమని తెలిపారు.
బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని జగ్గారెడ్డి కలిసి ఈ వివాదం పై చర్చించారు. భేటీ అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కోమటిరెడ్డి ఈ విషయంలో కలగజేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదని చెప్పారు.
జగ్గారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా నియమితులు కావాలంటే వరుసగా మూడేళ్లు పార్టీ కార్యకర్తగా కొనసాగాలనే ఏఐసీసీ నిబంధన ఉందన్నారు. తుంగతుర్తిలోని మూడు, నాలుగు మండలాల్లో ఈ నిబంధనల ప్రకారం నియామకాలు జరగలేదని సూచించారు. ఈ వ్యవహారంపై వివరాలు సేకరించి ఈ నెల 20వ తేదీలోగా నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు.
ఈ భేటీలో తుంగతుర్తి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సమస్యలు, సంస్థాగత వ్యవహారాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.