Minister Komatireddy: టీవీ అవార్డులు తెలంగాణ ఆత్మను ప్రతిబింబించాలి.. పేరు, లోగోపై మంత్రి కోమటిరెడ్డి సూచన

మంత్రి కోమటిరెడ్డి సూచన

Update: 2026-07-28 11:52 GMT

Minister Komatireddy: తెలంగాణ టీవీ అవార్డుల పేరు, లోగో రాష్ట్ర సంస్కృతి, ఆత్మను ప్రతిబింబించేలా ఉండాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. టీవీ అవార్డుల కమిటీ సభ్యులతో సమావేశమై అవార్డుల లోగో, పేర్లు, వివిధ కేటగిరీలపై విస్తృతంగా చర్చించారు.

మంత్రి సమావేశంలో కమిటీ సభ్యులు సూచించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును అవార్డులకు పెట్టాలనే ప్రతిపాదనపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి రెండు లేదా మూడు వేదికలు సూచించాలని కమిటీకి సూచనలు ఇచ్చారు. ఈ వేదికలపై సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

“అవార్డుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండాలి. టీవీ రంగం ప్రజలకు ఎక్కువగా వినోదాన్ని అందిస్తోంది. ఈ రంగంలో రాణిస్తున్న అన్ని కేటగిరీల కళాకారులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించి గౌరవించాలి” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం టీవీ, సినిమా రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, అవార్డుల ద్వారా ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించాలని భావిస్తోంది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మంత్రి వాటిని పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు చేపడతారని సమాచారం.

Tags:    

Similar News