Kavitha: రాష్ట్ర అజెండా మార్చేస్తాం: కవిత

కవిత

Update: 2026-07-01 13:35 GMT

Kavitha: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అజెండాను మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.

కవిత మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయకుండానే మళ్లీ అధికారంలోకి వస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలలు కంటున్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు లేవని చెబుతూ, మరోవైపు మూసీ ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు చేస్తామనడం ఏమిటని ప్రశ్నించారు.

తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా పేద ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదని కవిత అన్నారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతోనే తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేశామని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించేందుకు పూనుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అజెండా పూర్తిగా మార్చేస్తామని ప్రకటించారు.

పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కష్టపడి పని చేయాలని, హార్డ్ వర్క్‌పైనే నమ్మకం ఉంచాలని కవిత సూచించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. 

Similar News