TPCC President Mahesh Kumar Goud: అక్రమ ఓట్ల తొలగింపును అడ్డుకుంటాం: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

Update: 2026-05-23 10:26 GMT

TPCC President Mahesh Kumar Goud: ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) పేరిట అక్రమంగా ఓట్లను తొలగించే ప్రయత్నాలను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా అడ్డుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో SIR ప్రక్రియలో 31 లక్షల ఓట్లు చేర్చి, 93 లక్షల ఓట్లు తొలగించిన ఘటనను ఉదహరించారు. ఆ రాష్ట్రంలో టీఎంసీ 30 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిందని, ఇది ఓట్ల చోరీకి నిదర్శనమని ఆరోపించారు. అదే తరహాలో తెలంగాణలో కూడా అక్రమ తొలగింపులు జరగకుండా పార్టీ అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

ధాన్యం కొనుగోళ్లలో కొంత ఆలస్యం జరిగినా, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తన పనితీరుపై ఏఐసీసీ లేదా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బేరీజు వేస్తారని, పీసీసీ మార్పుల్లో ఏఐసీసీదే తుది నిర్ణయమని చెప్పారు. తెలంగాణ పీసీసీ ఏఐసీసీ దృష్టిలో ఉత్తమమైనదని కేసీ వేణుగోపాల్‌ అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు.

Tags:    

Similar News