Minister Sridhar Babu: బీఆర్‌ఎస్ తప్పులు సరిదిద్దుతుంటే మా మీద నిందలు ఎందుకు?: మంత్రి శ్రీధర్ బాబు

మంత్రి శ్రీధర్ బాబు

Update: 2026-06-08 14:21 GMT

Minister Sridhar Babu: బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలంలో చేసిన తప్పులను, లోపాలను సరిచేస్తున్నందుకు తమపై నిందలు వేస్తున్నారని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నాజీ సిద్ధాంతాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారని కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఖండించిన శ్రీధర్ బాబు, సీఎం ఎక్కడా హిట్లర్ సిద్ధాంతాలను అనుసరిస్తామని చెప్పలేదని స్పష్టం చేశారు. “ఏ పనైనా పట్టుదలతో, విరమించకుండా సాధించాలని సీఎం చెప్పారు. అలాంటి వ్యక్తిని హిట్లర్ అంటారు కానీ, అందులో తప్పు ఏముంది?” అని ప్రశ్నించారు.

హైడ్రా (హైదరాబాద్ ల్యాండ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీ) చర్యలపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ మంత్రి శ్రీధర్ బాబు, భూ కబ్జాదారుల గుండెల్లో భయం పుట్టిస్తున్నందుకే ఈ విమర్శలు వస్తున్నాయని అన్నారు. హైడ్రా పూర్తి చట్టపరిధిలోనే పని చేస్తోందని, రాజ్యాంగం మరియు చట్టాల ప్రకారమే నోటీసులు ఇస్తుందని వివరించారు.

ప్రజలు హైడ్రా చర్యలను హర్షిస్తున్నారని, ఈ చర్యల వల్ల బీఆర్‌ఎస్ నేతలకే ఇబ్బంది ఎక్కువగా కలుగుతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Tags:    

Similar News