Tirumala Ghat road : తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు
ఏనుగుల అడవిలోకి తరిమేసిన అటవీ సిబ్బంది;
తిరుమల గిరుల్లో ఏనుగుల గుంపు ప్రత్యక్షమై కలకలం సృష్టించాయి. తిరిమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడవ మైలు రాయి వద్ద గురువారం రాత్రి ఏనుగుల గుంపు కనిపించడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. దాదాపు ఐదారు ఏనుగులు ఒక్కసారిగా శేషాచలం అడవుల్లోంచి తిరుమల ఘాట్ రోడ్డులోని ఏడవ మైలు రాయి వద్ద రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించాయి. అకస్మాత్తుగా ఏనుగుల గుంపు కనిపంచడంతో వాహనాదారులు భయపడి వాహనాలను రహదారిపైనే నిలిపివేశారు. ఏనుగుల గుంపు కారణంగా వాహనాలు ముందుకు వెళ్ళే పరిస్ధితి లేకపోవడంతో వాహనదారులు విషయాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకుని ఏడొవ మైలు రాయి వద్దకు చేరుకునన్న అటవీ సిబ్బంది పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ ఏనుగుల గుంపును అడవిలోకి దారి మళ్ళించారు. ఈ క్రమంలో ఏనుగులు అటవీ సిబ్బందిపైకి దూసుకు వచ్చేందుకు ప్రయత్నించాయి. అయినా కూడా చాకచక్యంగా ఏనుగుల గుంపును అడవిలోకి తరిమేశారు.