Maruti Suzuki Eeco : పెద్ద ఫ్యామిలీకి పర్ఫెక్ట్.. ఎర్టిగా, ఇన్నోవా కంటే చాలా తక్కువ ధర..

ఎర్టిగా, ఇన్నోవా కంటే చాలా తక్కువ ధర..;

Update: 2025-08-05 08:03 GMT

Maruti Suzuki Eeco : మారుతి సుజుకి జులై 2025లో మరోసారి రికార్డు సృష్టించింది. గత నెలలో అమ్మకాల్లో ఏకంగా 3% వృద్ధి సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈసారి ఈ రికార్డుకు కారణం స్విఫ్ట్, బాలెనో, లేక ఆల్టో కాదు. ఊహించని విధంగా మారుతి సుజుకి వ్యాన్ సెగ్మెంట్ ఈకో టాప్‌లో నిలిచింది. ఎలాంటి ప్రచారం లేకుండానే ఈ చిన్నపాటి వ్యాన్ ఏకంగా 12,341 మంది కస్టమర్లను ఆకర్షించింది. ఇది జులై 2024 తో పోలిస్తే 3.57% వృద్ధిని నమోదు చేసింది. జూన్ 2025 లో కేవలం 9,340 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మళ్లీ జులై నెలలో పెద్ద సంఖ్యలో అమ్మకాలు జరిగాయి. ఈకో దేశంలోనే అత్యంత చౌకైన 7-సీటర్ కారుగా పేరుగాంచింది. దాని ప్రారంభ ధర కేవలం రూ.5.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలో 7 సీటర్ కార్లు మార్కెట్లో లేవు. అందుకే ఈకోకి అంత డిమాండ్ ఉంది. ఫ్యామిలీతో కలిసి ఎక్కువ మంది ప్రయాణించాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

గత కొన్ని నెలల అమ్మకాల లెక్కలు చూస్తే ఈకో ఎంత పాపులర్ అయిందో తెలుస్తుంది. నవంబర్ 2024 నుండి జులై 2025 వరకు ప్రతి నెలా ఈకో అమ్మకాలు చాలా స్థిరంగా ఉన్నాయి. డిసెంబర్, మే, జులై నెలల్లో ఏకంగా 12,000 మార్కును కూడా దాటింది. చాలా కుటుంబాలు తమ తొలి కారుగా ఈకోనే ఎంచుకుంటున్నారు. తక్కువ ధర, మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండటం, మంచి మైలేజ్ ఇవ్వడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. ఇన్నోవా, ఎర్టిగా వంటి ఖరీదైన 7-సీటర్ కార్లను కొనలేని వారికి ఈకో సరైన ఆప్షన్.

మారుతి సుజుకి కొత్త ఈకోను K-సిరీస్ 1.2 లీటర్ ఇంజిన్‌తో తీసుకొచ్చింది. ఇది పెట్రోల్‌పై 80.76 PS పవర్, 104.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG మోడల్‌లో అయితే, ఇది 71.65 PS పవర్, 95 Nm టార్క్‌ను అందిస్తుంది. కొత్త అప్‌డేట్‌తో మారుతి ఈకో మైలేజ్ కూడా మెరుగుపడింది. పెట్రోల్ మోడల్ లీటరుకు 20.2 కిమీ, CNG మోడల్ కిలోకు 27.05కిమీ మైలేజ్ ఇస్తుంది. సేఫ్టీ విషయంలో ఈకో ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. ఇప్పుడు దీనిలో 11 కొత్త సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వీటిలో రివర్స్ పార్కింగ్ సెన్సార్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, పిల్లల కోసం చైల్డ్ లాక్, సీట్ బెల్ట్ రిమైండర్, EBDతో కూడిన ABS, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

Tags:    

Similar News