Gold Price : బంగారం, వెండి కొనేవారికి గుడ్‌న్యూస్.. దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన ధరలు
దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన ధరలు
Gold Price : పండుగలు, శుభకార్యాలు ఎక్కువగా ఉండే ఈ సమయంలో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త. దేశంలో ఈ రోజు (నవంబర్ 21, 2025) బంగారం, వెండి ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. నిన్న గురువారం వెండి కొంత ర్యాలీ చేసినా, నేడు మాత్రం ఈ రెండింటి ధరలు పతనమయ్యాయి. పెరిగిన ధరల కారణంగా కొనుగోలు ఆపిన వారికి, ఇది పసిడి, వెండిని కొనుగోలు చేయడానికి మంచి సమయం అని చెప్పవచ్చు.
బంగారం, వెండి ధరలు రెండూ దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర ఏకంగా రూ.170 తగ్గి రూ.1,23,010 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర భారీగా పతనమైంది. కిలో వెండి ధర రూ.1,880 తగ్గి రూ.1,52,940 వద్దకు చేరింది. బులియన్ డేటా ప్రకారం ఈ రోజు 10 గ్రాముల బంగారం కొనాలంటే మీరు రూ.1,23,010 చెల్లించాల్సి ఉంటుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం, వెండి ధరలు పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.210 తగ్గి రూ.1,22,540 (10 గ్రాములు) వద్ద ట్రేడవుతోంది. వెండి ధర అయితే ఏకంగా రూ.2,020 తగ్గి రూ.1,52,250 (కిలో) వద్ద ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.450 తగ్గి రూ.1,22,510 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర ఇక్కడ మరింత ఎక్కువగా రూ.2,440 చౌకగా లభిస్తోంది. చెన్నైలో కూడా పసిడి, వెండి ధరలు తగ్గాయి. బంగారం ధర ముంబై ధరలకు సమానంగా రూ.1,22,510 (10 గ్రాములు) ఉండగా, వెండి ధర రూ.1,52,540 (కిలో) గా ఉంది. ఈ రోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24480 గా ఉంది, అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,100లుగా ఉంది.