Retirement Plan : రిటైర్మెంట్ తర్వాత కోటీశ్వరుడిలా బతకండి.. రూ.2 కోట్లతో నెలనెలా భారీ ఆదాయం వచ్చే సీక్రెట్ ఇదే
రూ.2 కోట్లతో నెలనెలా భారీ ఆదాయం వచ్చే సీక్రెట్ ఇదే
Retirement Plan : రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే దానికి సరైన ప్లానింగ్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర రిటైర్మెంట్ సమయానికి రూ.2 కోట్ల నిధి ఉంటే, దాని ద్వారా నెలనెలా ఎంత ఆదాయం పొందవచ్చు? ఆ డబ్బు ఎన్ని ఏళ్లు వస్తుంది? అనే ప్రశ్నలకు ఆర్థిక నిపుణులు కొన్ని అద్భుతమైన ఫార్ములాలను సూచిస్తున్నారు. సరైన పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే, చేతిలో ఉన్న రూ.2 కోట్లతో జీవితాంతం హ్యాపీగా గడిపేయవచ్చు.
నెలవారీ ఆదాయం ఎంత?
మీ దగ్గర ఉన్న రూ.2 కోట్ల నిధిపై మీరు ఎంత శాతం డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు అనే దానిపై మీ నెలవారీ ఆదాయం ఆధారపడి ఉంటుంది. దీనిని సేఫ్ విత్‌డ్రాయల్ రేట్(SWR) అంటారు. సాధారణంగా 4% విత్‌డ్రాయల్ రేటును నిపుణులు సురక్షితంగా భావిస్తారు.
* 3% విత్‌డ్రాయల్ రేట్: నెలకు సుమారు రూ.50,000 (తక్కువ రిస్క్)
* 4% విత్‌డ్రాయల్ రేట్: నెలకు సుమారు రూ.67,000 (బ్యాలెన్స్)
* 5% విత్‌డ్రాయల్ రేట్: నెలకు సుమారు రూ.83,000 (ఎక్కువ రిస్క్)
పెట్టుబడి పెట్టే విధానం
* మీరు మీ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారనేది మీ ఆదాయాన్ని నిర్ణయిస్తుంది.
* సురక్షిత పెట్టుబడులు : డబ్బును ఎఫ్ డీలు (FD), బాండ్లు లేదా ప్రభుత్వ పథకాల్లో పెడితే 6-6.5% రిటర్న్స్ రావచ్చు. దీనివల్ల నెలకు రూ.65,000 - 70,000 పొందవచ్చు.
* హైబ్రిడ్ పోర్ట్‌ఫోలియో : అటు డెట్, ఇటు ఈక్విటీలో కలిపి ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.75,000 - 85,000 సంపాదించవచ్చు.
* అగ్రెసివ్ పోర్ట్‌ఫోలియో : ఎక్కువ భాగం షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే దీర్ఘకాలంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. దీని ద్వారా నెలకు రూ.85,000 - 95,000 వరకు పొందవచ్చు, కానీ ఇందులో రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుంది.
3-బకెట్ స్ట్రాటజీతో పక్కా ప్లానింగ్:
రిటైర్మెంట్ తర్వాత డబ్బు అయిపోకుండా ఉండాలంటే ఈ 3-బకెట్ సూత్రాన్ని పాటించాలి:
* మొదటి బకెట్ (లిక్విడ్ ఫండ్): రాబోయే 1-1.5 ఏళ్ల ఖర్చులను అత్యవసర నిధిగా పక్కన పెట్టాలి.
* రెండవ బకెట్ (డెట్ ఫండ్): తర్వాతి 2-3 ఏళ్ల ఖర్చులను బాండ్లు లేదా డెట్ ఫండ్స్‌లో ఉంచాలి. ఇక్కడ రిస్క్ తక్కువగా ఉంటుంది.
* మూడవ బకెట్ (ఈక్విటీ/హైబ్రిడ్): మిగిలిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈక్విటీలో ఉంచాలి. ఇది ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మీ డబ్బు పెరగడానికి సహాయపడుతుంది.
ద్రవ్యోల్బణం - అసలైన శత్రువు
రిటైర్మెంట్ ప్లానింగ్‌లో అందరూ మర్చిపోయే విషయం ద్రవ్యోల్బణం. ఈ రోజు రూ.50,000 ఖర్చుతో గడిచిపోవచ్చు, కానీ మరో 20 ఏళ్ల తర్వాత అదే జీవనశైలికి రూ.1.5 లక్షలకు పైగా అవసరమవుతుంది. కాబట్టి మీ పెట్టుబడులు కేవలం వడ్డీని మాత్రమే కాకుండా, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వృద్ధిని కూడా ఇవ్వాలి. షేర్ మార్కెట్ పడిపోయినప్పుడు ఈక్విటీ నిధులను ముట్టుకోకుండా, సురక్షిత నిధుల (డెట్) నుంచి ఖర్చులకు వాడుకోవడం తెలివైన పని. క్రమం తప్పకుండా మీ పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకోవడం ద్వారా రూ.2 కోట్ల నిధితో ప్రశాంతమైన రిటైర్మెంట్ జీవితాన్ని గడపవచ్చు.