Actress Samantha Ruth Prabhu: దాచడానికి ఏమీ లేదు... ఓపెన్ గా చెప్పేసిన సామ్!

ఓపెన్ గా చెప్పేసిన సామ్!

Update: 2025-11-08 07:00 GMT

Actress Samantha Ruth Prabhu: ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య రిలేషన్ పై కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ సమంత ఇటీవల చేసిన ఒక పోస్ట్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తమ బంధాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ఓపెన్ గానే చెప్పేసింది. సమంత తన కొత్త పెర్ఫ్యూమ్ బ్రాండ్ "సీక్రెట్ ఆల్కెమిస్ట్" ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఆ ఫోటోలలో, రాజ్ నిడిమోరును సమంత ఆప్యాయంగా బిగి కౌగిలితో ఆలింగనం చేసుకున్న దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ఫోటోలో రాజ్ కూడా సమంత భుజంపై చేయి వేసి చాలా సన్నిహితంగా కనిపించారు. ఈ ఫోటోలతో పాటు సామ్ ఓ ఎమోషనల్ పోస్ట్ రాశారు. "గత ఏడాదిన్నర కాలంలో, నేను నా కెరీర్‌లో కొన్ని అత్యంత సాహసోపేతమైన అడుగులు వేశాను... అత్యంత తెలివైన, కష్టపడి పనిచేసే, ప్రామాణికమైన వ్యక్తులతో కలిసి పనిచేస్తున్నందుకు కృతజ్ఞురాలిని. ఇది కేవలం ప్రారంభం మాత్రమే," అని ఆమె పేర్కొన్నారు. తన పెర్ఫ్యూమ్ బ్రాండ్ ట్యాగ్‌లైన్ అయిన "#NothingToHide" (దాచడానికి ఏమీ లేదు) అనే పదాన్ని ఉపయోగించారు. ఈ ట్యాగ్‌లైన్ కేవలం బ్రాండ్‌కు మాత్రమే కాకుండా, రాజ్ నిడిమోరుతో తన బంధాన్ని ప్రపంచానికి బహిరంగంగా తెలియజేసే సంకేతంగానే అభిమానులు, నెటిజన్లు అర్థం చేసుకుంటున్నారు.కొంతకాలంగా రాజ్ నిడిమోరు, సమంత రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి ప్రాజెక్టులలో కలిసి పనిచేసినప్పటి నుండి వీరిద్దరూ కలిసి పబ్లిక్ ఈవెంట్లలో, వెకేషన్లలో తరచుగా కనిపించడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది.

Tags:    

Similar News