Actress Sameera Reddy: 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్
ఎన్టీఆర్ హీరోయిన్;
Actress Sameera Reddy: సినిమాలకు దూరమైన నటి సమీరా రెడ్డి దాదాపు 13 ఏళ్ల తర్వాత తిరిగి వెండితెరపై కనిపించబోతున్నారు. ఆమె కొత్త చిత్రం ఒక హారర్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. సమీరా రెడ్డి తన పునరాగమనాన్ని ఒక హారర్-థ్రిల్లర్ సినిమాతో చేయబోతున్నారు. ఈ సినిమాకు 'చిమ్ని' (Chimni) అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. గగన్ పూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమాలో తన పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని, భిన్నమైన కథాంశం కావడంతోనే ఈ సినిమాను ఎంచుకున్నానని సమీరా రెడ్డి తెలిపారు
సమీరా రెడ్డి తన రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. తన కుమారుడు అడిగిన ఒక ప్రశ్న తనలో మార్పు తెచ్చిందని చెప్పారు. గతంలో సమీరా నటించిన 'రేస్' (Race) సినిమా చూసిన ఆమె కుమారుడు, "మమ్మీ, నువ్వు ఇప్పుడు అలా కనిపించడం లేదు. నువ్వు ఎందుకు సినిమాలు చేయడం లేదు?" అని అడిగాడట. తాను తన కుటుంబం, పిల్లల పెంపకం కోసం కెరీర్‌కు విరామం ఇచ్చానని సమీరా చెప్పినప్పుడు, తిరిగి నటించడం మొదలు పెట్టమని కుమారుడు ప్రోత్సహించాడట.
'తేజ్' (Tezz) సినిమా (2012) తర్వాత సమీరా రెడ్డి సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన వ్యక్తిగత జీవితం, పిల్లలు, బాడీ పాజిటివిటీ వంటి విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.