Jatadhara First Look : హైప్ పెంచిన జటాధర ఫస్ట్ లుక్

జటాధర ఫస్ట్ లుక్;

Update: 2025-08-05 07:49 GMT

Jatadhara First Look : సుధీర్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'జటాధర'. ఇది ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ. 'జటాధర' ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మూవీ టిం టీజర్‌ను ఆగస్టు 8 న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సుధీర్ బాబు ఒక శక్తివంతమైన అవతారంలో కనిపించారు. మెరుపుల మధ్య ఆకాశాన్ని చీల్చుకుంటూ త్రిశూలం దూసుకువస్తున్నట్లు పోస్టర్ ఉంది. సుధీర్ బాబు ఒక యుద్ధానికి సిద్ధమైనట్లుగా ఉంటూ, అతని వెనుక ఉగ్ర శివుడి రూపం కనిపిస్తుంది. ఈ సినిమా అనంత పద్మనాభ స్వామి ఆలయం కథాంశంతో ఒక మైథలాజికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. మానవత్వం వర్సెస్ దైవత్వం, శాపం వర్సెస్ శక్తి మధ్య సాగే ఈ కథ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఈ చిత్రంలో సుధీర్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తుండగా, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కూడా ఒక కీలక పాత్రలో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. అలాగే శిల్పా శిరోడ్కర్ కూడా ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇతర నటులలో రవి ప్రకాష్, ఇందిరా కృష్ణ, రాజీవ్ కనకాల కూడా ఉన్నారు.

ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్ , అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరల్డ్ క్లాస్ గ్రాఫిక్స్ మరియు AI ఆధారిత స్టోరీటెల్లింగ్‌తో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం.

Tags:    

Similar News