The Paradise Movie: వాడి జడల్ని ముట్టుకుంటే వాడికి సర్రుమంటది

వాడికి సర్రుమంటది;

Update: 2025-08-12 06:30 GMT

The Paradise Movie: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' నుంచి స్పార్క్ ఆఫ్ ది ప్యారడైజ్' పేరుతో ఒక గ్లింప్స్ విడుదలైంది. 'దసరా' తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ వీడియోలో ఒక భారీ జైల్ సెట్‌లో చిత్రీకరించిన పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాన్ని చూపించారు. చుట్టూ కత్తులు పట్టుకున్న ఖైదీలు ఉన్నా, నాని తన రగ్గడ్ లుక్‌లో, ఒంటరిగా, ఎటువంటి ఆయుధం లేకుండా కుర్చీలో కూర్చోవడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. వాడి జడల్ని ముట్టుకుంటే వాడికి సర్రుమంటది అనే డైలాగ్ చివర్లో వినిపిస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసం 15 రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిగింది.

ఈ సినిమాలో నాని 'జడల్' అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ గ్లింప్స్‌లో రెండు పొడవాటి జడలు, ముఖం మీద గాయాలతో చాలా రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపించాడు. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌ను మరింత పవర్‌ఫుల్‌గా మార్చింది. ఈ సినిమా 2026 మార్చి 26న విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా విడుదల కానుంది.

Tags:    

Similar News