Avika Gor: కాబోయే భర్తను పరిచయం చేసిన టాలీవుడ్ హీరోయిన్
మిలింద్ చంద్వాని పరిచయం చేసిన టాలీవుడ్ హీరోయిన్
Avika Gor: చిన్నారి పెళ్లి కూతురితో తెలుగు వాళ్లకు పరిచయం అయిన ఆవికా గోర్ పె తన ప్రియుడితో ఏడడుగులు వేయడానికి సిద్ధమైంది. ఐదేళ్ల ప్రేమ పెళ్లిగా మారబోతుంది. తన ప్రియుడు మిలింద్ చంద్వానీతో ఉన్న ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఆవికాగోర్ తన ఎంగేజ్ మెంట్ జరిగినట్లు చెప్పింది.
మిలింద్ చంద్వానీతో ఆవికాగోర్ 2020 నుంచి ప్రేమలో ఉంది.ప్రియుడు మిలింద్ చంద్వాని పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు తన ఆనందానికి అవధుల్లేవని సంతోషంతో ఏడ్చేశానని చెప్పింది ఆవికా గోర్. ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నట్లు గట్టిగా అరిచా.నిజమైన ప్రేమ అంటే ఇదే కావొచ్చని చెప్పుకొచ్చింది.
మిలింద్ చంద్ వానీ ఎవరు
మిలింద్ చంద్వానీ క్యాంప్ డైరీస్ అనే ఎన్జీవోను నడుపుతున్నాడు. IIM అహ్మదాబాద్ నుంచి MBA పట్టభద్రుడైన మిలింద్ 2019లో MTV రోడీస్ రియల్ హీరోస్ షో ద్వారా పాపులర్ అయ్యాడు.
ఆవికా గోర్ ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. సినిమా చూపిస్తా మావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా,బ్రో,షణ్ముఖ, లక్ష్మీ రావే మా ఇంటికి వంటి సినిమాల్లో నటించింది ఆవికా గోర్.