Sigma:సందీప్ కిషన్ తో విజయ్ కొడుకు.. సిగ్మా ఫస్ట్ లుక్ అదిరింది

సిగ్మా ఫస్ట్ లుక్ అదిరింది

Update: 2025-11-10 08:44 GMT

Sigma: సందీప్ కిషన్ హీరోగా.. హీరో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న మొదటి సినిమా టైటిల్‌ను తాజాగా సిగ్మా' (Sigma)గా ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా నవంబర్ 10న ఈ సినిమా టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు .ఫస్ట్ లుక్ పోస్టర్, చిత్ర యూనిట్ ప్రకటనల ప్రకారం, ఈ సినిమా డబ్బు చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్ ,అడ్వెంచర్ కామెడీగా ఉండబోతోంది. ఇది హై-స్టేక్స్ క్రిమినల్ హెయిస్ట్‌లు, నిధి వేట అంశాలను కలిగి ఉంటుంది.

దర్శకుడు జాసన్ సంజయ్ ఈ సినిమా టైటిల్ గురించి వివరిస్తూ, "సమాజ నిబంధనలకు కట్టుబడకుండా, తనదైన మార్గంలో పయనించే, భయంలేని, స్వతంత్ర స్ఫూర్తిని 'సిగ్మా' అనే కాన్సెప్ట్ తెలియజేస్తుంది" అని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. 65 రోజుల్లో 95% షూటింగ్ పూర్తయినట్లు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. కేవలం ఒక పాట షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. తమన్ ఈ సినిమాకు మ్యూజింగ్ అందిస్తున్నారు. జాసన్ సంజయ్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో, ముఖ్యంగా తమిళ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాత, ఈ సినిమాను 2026 వేసవిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చిత్రం ఏకకాలంలో తమిళం,తెలుగులో విడుదల కానుంది.

Tags:    

Similar News