Lakshmi Narayana Yoga Begins on September 26: జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు, శుక్ర గ్రహాల కలయికకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ రెండు శుభ గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు అత్యంత శక్తిమంతమైన లక్ష్మీ నారాయణ యోగం రూపుదిద్దుకుంటుంది. ఈ యోగం సంపద, వైభవం, శ్రేయస్సు, సకల సుఖభోగాలకు ప్రతీకగా భావిస్తారు. దృక్ పంచాంగం ప్రకారం, సెప్టెంబర్ 26న బుధ గ్రహం తన మిత్ర గ్రహమైన శుక్రుడు ఇప్పటికే సంచరిస్తున్న తులారాశిలోకి ప్రవేశించనుంది. స్వక్షేత్రమైన తులలో శుక్రుడితో బుధుడు కలవడం వల్ల ఏర్పడే ఈ మహా రాజయోగం ప్రధానంగా 5 రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులను తీసుకురానుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశుల వివరాలు పరిశీలిద్దాం.

తులారాశి - కలల సాకారం.. ఆస్తి కొనుగోలు యోగం

ఈ రాశిలోనే లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుండటంతో తులారాశి వారికి అత్యధిక ప్రయోజనాలు దక్కుతాయి. దీర్ఘకాలంగా రావాల్సిన బకాయిలు, నిలిచిపోయిన సొమ్ము చేతికి అందుతుంది. కొత్త ఇల్లు, స్థలం లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. చాలా కాలంగా ఉన్న ఒక పెద్ద కల లేదా లక్ష్యం సాకారమవుతుంది. అవివాహితులకు తమకు నచ్చిన జీవిత భాగస్వామి లభించే యోగం ఉంది. కెరీర్‌లో పదోన్నతితో పాటు సమాజంలో విశేష కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

వృశ్చిక రాశి - ఆర్థిక కష్టాలు దూరం.. కొత్త బాధ్యతలు

వృశ్చిక రాశి వారికి ఈ యోగ ప్రభావం వల్ల సరికొత్త మార్పులు ప్రారంభమవుతాయి. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, రుణ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ఆఫీసులో కీలకమైన నూతన బాధ్యతలు లేదా పదోన్నతి దక్కే అవకాశం ఉంది. మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సానుకూల మార్పులు చోటుచేసుకుని, మీ జీవితం సరికొత్త దిశలో విజయవంతంగా ముందుకు సాగుతుంది.

సింహ రాశి- ప్రజా జీవితంలో గౌరవం.. వ్యాపారంలో లాభాలు

సింహ రాశి జాతకులకు బుధ-శుక్ర సంయోగం విశేష శుభ ఫలితాలను ఇస్తుంది. రాజకీయాలు, సామాజిక రంగం లేదా ప్రజా జీవితంలో ఉన్నవారికి ప్రజల్లో గౌరవ మర్యాదలు, ఆదరణ గణనీయంగా పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు సమకూరుతాయి. నూతన ప్రాజెక్టులు, వెంచర్లు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం.

కన్యారాశి - మెరుగైన కమ్యూనికేషన్.. డీల్స్ క్లోజ్

కన్యారాశి వారికి ఈ కాలంలో తెలివితేటలు, సంభాషణా నైపుణ్యం మరింత రాణిస్తాయి. మీ వాక్చాతుర్యం మెరుగుపడటం వల్ల ముఖ్యమైన వ్యాపార సమావేశాలు, చర్చలు మరియు లావాదేవీలు అనుకూలంగా పూర్తవుతాయి. పని ప్రదేశంలో ఎలాంటి అజాగ్రత్తకు తావివ్వకూడదు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున బాధ్యతగా వ్యవహరించడం ముఖ్యం.

మకర రాశి - నూతన ఉద్యోగ యోగం.. కోరుకున్న ప్రాంతానికి బదిలీ

మకర రాశి వారికి లక్ష్మీ నారాయణ యోగం వృత్తిపరంగా నూతన అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి ప్యాకేజీతో నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగులు కోరుకున్న ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ అయ్యే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ లేదా ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉండి, ఆశించిన ఫలితాలు దక్కుతాయి.

Tags: