Raj Yogas in August: ఆగస్టులో రాజయోగాలు.. ఈ 4 రాశుల వారికి సొంతిల్లు, వాహన యోగం ఖాయం..

వాహన యోగం ఖాయం..

Update: 2026-08-04 11:21 GMT

Raj Yogas in August: వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఆగస్టు నెలలో జరిగే గ్రహాల సంచారం మరియు కలయికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ నెలలో ప్రధాన గ్రహాల రాశి మార్పు వల్ల అనేక శుభకరమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. జ్యోతిష్య నిపుణుల గణాంకాల ప్రకారం, ఈ అరుదైన యోగాల ప్రభావంతో ముఖ్యంగా 4 రాశుల వారి జాతకం పూర్తిగా మారనుంది. వీరికి ఆర్థికంగా కలిసొచ్చాడమే కాకుండా కొత్త ఇల్లు, స్థలం లేదా వాహనం కొనుగోలు చేసే డ్రీమ్ నెరవేరబోతోంది.

ఆగస్టు రాజయోగాలతో అదృష్టం వరించే 4 రాశులు..

మేష రాశి

మేష రాశి వారికి ఆగస్టు నెలలో గ్రహాల అనుకూలత వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. నూతన గృహం కొనుగోలు చేయడానికి లేదా స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం.

మిథున రాశి

రాజయోగాల ప్రభావంతో మిథున రాశి వారి ఆత్మవిశ్వాసం, సామాజిక గౌరవం పెరుగుతాయి. చాలా కాలంగా సొంత వాహనం లేదా నూతన ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారి నిరీక్షణ ఫలిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.

సింహ రాశి : సింహ రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు గడిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆస్తికి సంబంధించిన పాత వివాదాలు పరిష్కారమై కొత్త ఆస్తులు సమకూరే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి అదృష్టం తోడై చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. విలాసవంతమైన వాహనాలు లేదా నూతన గృహోపకరణాలు కొనుగోలు చేసే యోగం ఉంది. ఉద్యోగస్తులకు జీతాల పెంపు, ప్రమోషన్లు లభించే సూచనలు స్పష్టంగా ఉన్నాయి.

అదృష్టం మరింత పెరగడానికి పరిహారాలు

లక్ష్మీనారాయణుల నిత్య ఆరాధన చేయడం వల్ల రాజయోగాల ఫలితాలు శీఘ్రంగా లభిస్తాయి.

ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అత్యంత శుభకరం.

Tags:    

Similar News