Srivari Brahmotsavams: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆదివారం తిరుమలలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఉదయం 4:30 నుండి 5:30 గంటల వరకు శ్రీమతి లక్ష్మి సువర్ణ మరియు చంద్రశేఖర్ బృందం నాదస్వరం, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు శ్రీమతి ఉమా ముద్దు బాల బృందం భక్తి సంగీతం నిర్వహించారు.

ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి సునంద దేవి విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు విజయనగరం కు చెందిన డాక్టర్ ఆముక్త మాల్యద బృందం భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి 12.30 గంటల వరకు నరసాపురంకు చెందిన శ్రీమాన్ వెంకటాచార్యుల ధార్మికో ఉపన్యాసం ఇచ్చారు.

సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఆనంద భట్టర్ బృందం అన్నమయ్య సంకీర్తనలను సుమధురంగా గానం చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు కర్నూలుకు చెందిన శ్రీ లక్ష్మీ ప్రకాష్ బృందం హరికథ గానం జరిగింది.

ఈ కార్యక్రమాలను భక్తులు పెద్ద సంఖ్యలో వీక్షించి స్వామివారి భక్తిలో మునిగిపోయారు.

Tags: