GMR Aero Academy : జీఎంఆర్ ఏరో అకాడమీ నుంచి సర్టిఫికేషన్ కోర్సులు

ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌లైన్, కార్గో ఆపరేషన్స్ కోర్సుల్లో శిక్షణ ప్రారంభం;

Update: 2025-08-05 10:24 GMT

గ్లోబల్ గుర్తింపు పొందిన విమానయాన శిక్షణ సంస్థ అయిన జీఎంఆర్ ఏరో అకాడమీ తన తొలి ఆన్‌లైన్ ఇన్‌స్ట్రక్టర్-లెడ్ శిక్షణా ప్రోగ్రామ్ అయిన సర్టిఫికేట్ ఇన్ ఎయిర్పోర్టు ఎయిర్లైన్ అండ్ కార్గో ఆపారేషన్స్ ను విజయవంతంగా ప్రారంభించింది. ఈ మూడునెలల ఆన్‌లైన్ కార్యక్రమం పాల్గొనేవారికి విమానయాన రంగం పట్ల సమగ్ర అవగాహన కలిగించడానికి దోహదపడుతుంది. ఈ కోర్సులో బేసిక్ థియరీలతో పాటు ప్రధాన కార్యకలాప రంగాలలో ప్రాక్టికల్ శిక్షణను ఇస్తారు. వీటిలో ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్, ర్యాంప్ ఆపరేషన్స్, ఏవియేషన్ సెక్యూరిటీ, కార్గో ఆపరేషన్స్, ఏవియేషన్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ కి సంబంధించిన కోర్సులు ఉన్నాయి.

ఈ సందర్భంగా జీఎంఆర్ ఏరో ఎయిర్పోర్టు స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ సీఈఓ ఆండ్రూ అక్వా హారిసన్ మాట్లాడుతూ CAACO ప్రోగ్రాం భారతదేశంలో విమానయాన శిక్షణను మరింత సులభతరం చేస్తుందని తెలిపారు. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మరియు మూడవ అతిపెద్ద విమాన ప్రయాణ మార్కెట్‌గా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగం ద్వారా మరింత కనెక్టివిటీని పొందుతోందని చెప్పారు. రెండు దశల్లో ఈ కోర్సు అందిస్తున్నామని మొదటి దశలో సివిల్ ఏవియేషన్ పునాది అంశాలు, రెగ్యులేటరీ బాడీలు, టైమ్ జోన్స్ మరియు కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఉంటాయని తెలిపారు. అలాగే రెండో దశలో ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్, ర్యాంప్ ఆపరేషన్స్, ఏవియేషన్ సెక్యూరిటీ మరియు కార్గో ఆపరేషన్స్ పై ఆపరేషనల్ ఫోకస్ ఉంటుందన్నారు. ఈ ప్రోగ్రాంలో 27 సంవత్సరాల లోపు ఉన్న గ్రాడ్యుయేట్‌లకు, అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగినవారికి ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. తమ కెరీర్‌ను విమానయాన రంగంలో ప్రారంభించదలచిన యువతీయువకులకు ఇది గొప్ప అవకాశం అని సీఈఓ ఆండ్రూ హరిసన్‌ చెప్పారు.

Tags:    

Similar News