తెలంగాణలో గ్రూప్, 2, 3 ఇంటర్వ్యూలకు సన్నాహాలు

Commission exercises for Group, 2, 3 interviews in Telangana;

Update: 2025-05-23 08:21 GMT

తెలంగాణలో 2,171 గ్రూప్-2, 3 పోస్టుల భర్తీకి కమిషన్‌ కసరత్తు ప్రారంభించింది,. రాత పరీక్షల్లో జనరల్‌ ర్యాంకింగ్‌ ఆధారంగా అభ్యర్ధుల ద్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు పరిపాలన ప్రక్రియను టీజీపీఎస్సీ ఇప్పటికే పూర్తి చేసింది. ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్లు, మొత్తం పోస్టుల సంఖ్య ఆధారంగా 1:11 నిష్ప త్తిలో అభ్యర్థుల జాబితా ప్రకటించనుంది. గ్రూప్‌2, గ్రూప్‌ 3 ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఇప్పటికే ఆలస్యం కావడంతో వెంటనే చేపట్టడమో, గ్రూప్‌ 3 పోస్టింగుల ప్రక్రియ పూర్తయ్యాక చేపట్టాలనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 783 గ్రూప్‌2 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు 15, 16 తేదీల్లో రాత పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు ,49,964 మంది హాజరయ్యారు. ఓఎంఆర్ పత్రాల్లో పొరపాట్లు చేయడం, బబ్లింగ్ సరిగా చేయకపోవడం వంటి కారణాలతో 13,315 మంది అభ్యర్థులను కమిషన్ అనర్హులుగా ప్రకటించింది.

మరోవైపు గ్రూప్-2 పరీక్షలు పూర్తైన మూడు నెలల్లోపే జనరల్ ర్యాంకు జాబితా టీజీపీఎస్సీ ప్రకటించింది. పరీక్ష రాసిన వారిలో 2,36,649 మందికి వచ్చిన మార్కులతో జనరల్ ర్యాంకింగ్‌ జాబితాను ఈ ఏడాది మార్చి 11న విడుదల చేశారుు.గ్రూప్-3 రాత పరీక్షల జనరల్‌ ర్యాంకింగ్‌ కూడా ఇప్పటికే విడుదలైంది. గ్రూప్‌ 3లో 1,388 పోస్టుల భర్తీకి 2024 నవంబరు 17, 18 తేదీల్లో నిర్వహించిన రాత పరీక్షలకు 2,67,921 మంది హాజర య్యారు. పరీక్షల్లో నిబంధనలు పాటించని 18,364 మందిని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. మిగిలిన 2,49,557 మంది అభ్యర్థులతో మార్చి 14న జనరల్ ర్యాంకింగ్‌ లిస్ట్‌ విడుదలైంది. ఏప్రిల్ నెలాఖరుకు అన్ని నియామకాలు పూర్తి చేయాలని కమిషన్‌ భావించినా గ్రూప్-1పై న్యాయవివాదాలు రావడంతో గ్రూప్‌ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ ఆలస్యమైంది. గ్రూప్-1 నియామక ప్రక్రియ పూర్తి కాకుండా గ్రూప్-2, 3 ఎంపికలు ప్రారంభిస్తే పోస్టుల్లో ఖాళీలు మిగిలిపోతాయని కమిషన్ భావిస్తోంది. మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ప్రాధాన్య క్రమంలో పోస్టుల్ని భర్తీ చేయాలని యోచిస్తోంది.

స్త్రీ శిశు సంక్షేమ శాఖలో సీడీపీవో, మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 2022లో విడుదలైన 23 పోస్టులకు 19,812 మంది దర ఖాస్తు చేశారు. 2023 జనవరిలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత టీజీపీఎస్సీ పరీక్షల పేపర్‌ లీక్‌ కావడంతో ఈ ఏడాది జనవరి 3,4 తేదీల్లో మరోసారి ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించారు. దీని ఆధారంగా మల్టీ జోన్‌ 1,2 ఫలితాలను విడుదల చేశారు. కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి.

Tags:    

Similar News