Tmilanadu Education Policy : త్రిభాషా విధానం వద్దు… ద్విభాషా విధానమే ముద్దు

నూతన విద్యా విధానాన్ని ఆవిష్కరించిన తమిళనాడు సియం స్టాలిన్‌;

Update: 2025-08-08 10:40 GMT

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానాన్ని ఛాలెంజ్‌ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రకటించింది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఆంగ్ల విద్యల ప్రాముఖ్యతలను ప్రస్పుటిస్తూ ద్విభాషా విధానానికి ప్రాధాన్యత ఇస్తూ తమిళనాడు విద్యా పాలసీ రూపొందించారు. చెన్నైలోని అన్నా సెంటినరీ లైబ్రరీ ఆడిటోరింలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ తమిళనాడు రాష్ట్ర విద్యా విధానాన్ని ఆవిష్కరించారు. తమిళనాడు ప్రకటించిన ఈ నూతన విద్యా విధానం జాతీయ విద్యావిధానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. 2022వ సంవత్సరంలో రిటైర్డ్‌ జస్టిస్‌ మురుగేశన్‌ నేతృత్వంలో 14 మంది సభ్యులతో నూతన విద్యావిధానం రూపకల్పనకు స్టాలిన్‌ ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది. ఈ కమిటీ ఖరారు చేసిన విద్యావిధానంలో త్రిభాషా విధానాన్ని తిరస్కరించారు. ఈ నూతన విద్యా విధానంలో 11, 12 తరగతుల మార్కుల ఆధారంగా అండర్‌ గ్రాడ్యేయేట్‌ ప్రవేశాలు చేయాలని మురుగేశన్‌ కమిటీ సిఫార్సు చేసింది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గించే విధంగా ఈ నూతన విద్యావిధానాన్ని రూపొందించారు. విద్యాను వ్యాపారం చేయడానికి ఆస్కారం ఉన్న 3, 5, 8 తరగతులకు పబ్లిక్‌ పరీక్షల విధానాన్ని మురుగేశన్‌ కమిటీ వ్యతిరేకించింది. అలాగే ప్రస్తుతం ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యాను రాష్ట్ర జాబితాలోకి మార్చాలని కూడా మురుగేవన్‌ కమిటీ సిఫార్సు చేసింది.

Tags:    

Similar News