Keep Your Kidneys Healthy: రోజుకు 180 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేసే కిడ్నీలు పదిలంగా ఉండాలంటే.. ఈ 5 అలవాట్లు తప్పనిసరి..

ఈ 5 అలవాట్లు తప్పనిసరి..

Update: 2026-06-26 04:08 GMT

Keep Your Kidneys Healthy: మానవ శరీరంలో గుండె, మెదడు ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, శరీరంలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసే అత్యంత ముఖ్యమైన అవయవాలైన మూత్రపిండాల ఆరోగ్యాన్ని మాత్రం చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కిడ్నీలు మన శరీరంలో ప్రతిరోజూ సుమారు 180 నుండి 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్తంలోని విషపూరిత వ్యర్థాలను, అదనపు ద్రవాలను మూత్రం రూపంలో బయటకు పంపే కీలక బాధ్యత ఇవే తీసుకుంటాయి.

ఒకవేళ కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటే అది హైబీపీ, మధుమేహం, గుండె జబ్బుల వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి కిడ్నీలను సహజసిద్ధంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ డైలీ లైఫ్‌లో భాగం చేసుకోవాల్సిన ఆ 5 అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం

రోజూ ఉదయం లేదా సాయంత్రం కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటి శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది మరియు శరీర బరువు అదుపులో ఉంటుంది. ఇది కిడ్నీలపై అదనపు ఒత్తిడి పడకుండా కాపాడుతుంది.

చక్కెర వినియోగాన్ని తగ్గించండి

దీర్ఘకాలికంగా ఉండే మధుమేహం కిడ్నీ వైఫల్యానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే అవి కిడ్నీల్లోని రక్తనాళాలను దెబ్బతీస్తాయి. కాబట్టి స్వీట్లు, బేకరీ ఫుడ్స్, చక్కెర ఎక్కువగా ఉండే శీతల పానీయాలకు వీలైనంత దూరంగా ఉండటం చాలా మంచిది.

రక్తపోటును అదుపులో ఉంచుకోండి

అధిక రక్తపోటు సమస్య కిడ్నీలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. కిడ్నీల్లోని ఫిల్ట్రేషన్ వ్యవస్థ దెబ్బతినడానికి హైబీపీ ఒక ముఖ్య కారణం. అందుకే క్రమం తప్పకుండా బీపీ పరీక్షలు చేయించుకుంటూ, వైద్యుల సలహా మేరకు దానిని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.

సమతుల్య ఆహారం తీసుకోండి

మీ రోజువారీ డైట్‌లో తాజా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు మరియు పప్పుధాన్యాలను భాగం చేసుకోండి. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల శరీర బరువు పెరగకుండా ఉంటుంది. ఇది పరోక్షంగా కిడ్నీల పనితీరు సజావుగా సాగడానికి దోహదపడుతుంది.

ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించండి

ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి, రక్తపోటు వేగంగా పెరుగుతుంది. ఫలితంగా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ప్రాసెస్ చేసిన నిల్వ ఆహారాలు, పచ్చళ్లు, చిప్స్ వంటి వాటిని పరిమితం చేయాలి. ఆహారంలో రుచి కోసం ఉప్పును ఎక్కువగా దట్టించే బదులు నిమ్మరసం, వెల్లుల్లి లేదా సహజసిద్ధమైన మసాలా దినుసులను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.

Tags:    

Similar News