You Consume Too Much Sugar: మీరు ఎక్కువ చక్కెర తీసుకుంటే శరీరంలో జరిగేది ఇదే..
చక్కెర తీసుకుంటే శరీరంలో జరిగేది ఇదే..
You Consume Too Much Sugar: మంచి ఆరోగ్యం కోసం సరైన ఆహార నియమాలు పాటించడం అత్యవసరం. ముఖ్యంగా చక్కెర, ఉప్పు వినియోగాన్ని మితంగా ఉంచుకోవాలి. శరీరంలో చక్కెర స్థాయి పెరిగితే అది కాలేయాన్ని ప్రభావితం చేయడం, కొలెస్ట్రాల్ పెంచడం, ఊబకాయం, మూత్రపిండాల సమస్యలు, అధిక రక్తపోటుకు దారితీయవచ్చు. అందుకే మనం ఎంత చక్కెర తీసుకుంటున్నామో దానిపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. శరీరంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉందో లేదో తెలిపే లక్షణాలను గుర్తించడం ద్వారా మధుమేహం రాకుండా నిరోధించవచ్చు.
శరీరంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే.. అది కొన్ని లక్షణాల ద్వారా వ్యక్తమవుతుంది. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఆకలిలో మార్పు. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల కేలరీలు పెరుగుతాయి, ఇది ఆకలిని తగ్గిస్తుంది. మీరు రోజురోజుకూ మీ ఆకలిని కోల్పోతుంటే లేదా మీకు తరచుగా ఎక్కువ తీపి తినాలనే కోరిక అనిపిస్తే, అది అధిక చక్కెర స్థాయికి సంకేతం కావచ్చు. అదనంగా అధిక చక్కెర వినియోగం శరీర బరువు పెరగడానికి కారణమవుతుంది. ఎటువంటి కారణం లేకుండా బరువు పెరుగుతుంటే, దానికి చక్కెర కారణం కావచ్చు.
అధిక గ్లూకోజ్ స్థాయిల కారణంగా ముఖంపై మొటిమలు రావడం లేదా విరేచనాలు వంటివి కూడా కనిపించవచ్చు. వీటితో పాటు తెల్ల చక్కెర సైటోకిన్‌లను విడుదల చేస్తుంది. ఇది చిరాకు, అలసటకు దారితీస్తుంది. మరొక ముఖ్యమైన లక్షణం నిద్ర సమస్యలు. ఎందుకంటే అధిక చక్కెర వినియోగం శరీరంలో నిద్రకు చాలా అవసరమైన మెగ్నీషియం స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి నిద్ర చక్రంలో మార్పులు ఉంటే, మీరు చాలా చక్కెరను ఎక్కువగా తీసుకుంటున్నారని అర్థం.
అయినప్పటికీ.. బరువు పెరుగుతామనే భయంతో లేదా ఇతర కారణాల వల్ల తీపి ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. శరీరానికి సహజ చక్కెర అవసరం. కాబట్టి, మీరు పండ్లు, పాల ఉత్పత్తులను తీసుకోవాలి. ఇవి శరీరానికి సహజ చక్కెరను అందిస్తాయి. ఎటువంటి హాని కలిగించవు. ఈ లక్షణాలను గుర్తించి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే, మీ చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.