రాజస్తాన్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం
స్కూలు భవనం పైకప్పు కూలి 4 విద్యార్థులు మృతి;
శిధిలాల కింద చిక్కుకున్న మరో 40 మంది విద్యార్థులు
రాజస్తాన్ లోని ఓ ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి ఐదుగురు విద్యార్థులు మృతి చెందగా శిధిలాల కింద మరో 40 మంది విద్యార్థులు చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘోర ప్రమాదం రాజస్తాన్ రాష్ట్రంలోని ఝలవార్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఝలవార్ జిల్లాలోని మనోహర్ థానాలో పరిధిలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పాఠశాల భవనంలోని ఒక తరగతి గది పైకప్పు కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన గ్రామస్తులు, ఉపాధ్యాయులు కలసి శిధిలాలను తొగించి లోపల చిక్కుకు పోయిన విద్యార్థులను వెలికి తీసే ప్రయత్నం మెదలు పెట్టారు. ఈ క్రమంలో ఐదుగురు విద్యార్థుల మృత దేహాలు బయటపడ్డాయి. శిధిలాల కింద మరో 40 మంది విద్యార్థులు చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు, విద్యాశాఖ అధికారులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.