AMITH SHA : అత్యధికాలం హోం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అమిత్‌షా రికార్డ్‌

ఆగస్టు5వ తేదీతో ఎల్‌కేఅద్వానీ రికార్డును అధిగమించిన అమిత్‌షా;

Update: 2025-08-06 11:52 GMT

భారత దేశంలో అత్యధిక కాలం హోం శాఖ బాధ్యతలు నిర్వర్తించిన మంత్రిగా అమిత్‌ షా సరికొత్త రికార్డు నెలకొప్పారు. నిన్న మంగళవారంతో హోంమంత్రిగా 2258 రోజులు పూర్తి చేసుకుని అమిత్‌షా ఈ ఘనత సాధించారు. 2019 మే 30వ తేదీన అమిత్‌షా కేంద్ర హోం శాఖామాత్యులుగా బాధ్యతలు తీసుకున్నారు. ఆనాటి నుంచి నేటి వరకూ ఆయనే హోం మంత్రిగా కొనసాగుతున్నారు. అమిత్‌షా కన్న ముందు అత్యధికాలం హోం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఎల్‌కేఅద్వానీ ఉన్నారు. అద్వానీ 2256 రోజుల పాటు హోంత్రిగా కొనసాగారు. అమిత్‌షా, అద్వానీలు ఇద్దరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాల్లో ఈ ఘనత సాధించారు. అద్వానీకి ముందు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ అత్యధికాలం భారత దేశానికి హోంమంత్రిగా పనిచేసిన మడొవ వ్యక్తాగా నిలిచారు. గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ 6 సంత్సరాల 56 రోజుల పాటు హోంమంత్రిగా పనిచేశారు. అంటే సుమారు 2248 రోజుల పాటు ఆయన భారత దేశానికి హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. హోం మంత్రిగా అమిత్‌షా టెన్యూర్‌లో అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. భారత దేశంలో పలు కీలక పరిణామాలకు కారణభతమై అనేక మైలు రాళ్ళను దాటిన ఖ్యాతి గడించారు. ఇందులో ప్రధానంగా జమ్మూకాశ్మీర్‌ ప్రాంతంలో ఆర్టికల్‌ 370 రద్దు చెయ్యడం ద్వారా జమ్మూకాశ్మీర్‌ ప్రాంతానికి ఉన్న ప్రత్యేక హోదాను కూడా తొలగించారు. ఇందుకోసం పార్లమెంటులో సిటిజన్‌షిప్‌ యాక్ట్‌ని సవరించారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ స్థానంలో భారతీయ న్యాయ సంహితను ప్రచారంలోకి తీసుకు వచ్చారు. అలాగే దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమాన్ని తుడిచిపెట్టడానికి చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ వంటి ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలను హోం మంత్రిగా అమిత్‌ షా తన హయాంలో తీసుకున్నారు. అత్యధికాలం భారతదేశానికి హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన మైలురాయిని చేరుకున్నందుకు అమిత్‌ షాను ప్రదాని నరేంద్రమోడీ అభినందించారు.

Tags:    

Similar News