కొవిడ్ తో ఇద్దరి మృతి

Two deaths due to Covid, cases increasing in states

Update: 2025-05-26 10:13 GMT

దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. COVID-19 కారణంగా ఇద్దరి మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం మహారాష్ట్రలోని థానేకు చెందిన 21 ఏళ్ల యువకుడు, కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు వైరస్ బారిన పడ్డారు. సమస్య తీవ్రం అవడంతో వీరిద్దరు మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇన్ఫెక్షన్లు తిరిగి పెరగటంతో ఆరోగ్య అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీల్లో కేసులు పెరుగుతున్నాయి.

రాష్ట్రాల వారిగా COVID-19 కేసులు

కేరళ: 403 

తమిళనాడు: 66 

మహారాష్ట్ర: 209 

ఢిల్లీ: 100 

గుజరాత్ : 83

కర్ణాటక: 47 

ఉత్తరప్రదేశ్ : 15

పశ్చిమబెంగాల్ : 12

ముఖ్యంగా వృద్ధులు, ఇప్పటికే అనారోగ్యంగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంకా ఎటువంటి కొత్త ఆంక్షలను ప్రకటించలేదు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్ వాడకం, ముందు జాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News